ఇంకో ఇన్నింగ్స్ కి లైలా సై!


లైలా గుర్తుందా? ఆమె స్మైల్ క్వీన్. 20 ఏళ్ల క్రితం ఆమె హవా బాగా నడిచింది. ఐతే, ఒక తమిళ హీరోతో ప్రేమాయణం చెడి… సినిమాలకు దూరమైంది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇటువైపు వచ్చింది.

లైలా నటించిన తాజా చిత్రం… సర్దార్. కార్తీ హీరోగా నటించిన మూవీ. ఇందులో ఆమె ఒక కీలక పాత్ర పోషించారు. ఇంతకుముందు కార్తీ సోదరుడు సూర్య కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ‘శివపుత్రుడు’లో ఆమె నటించారు. ఇప్పుడు కార్తీ సినిమాతో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.

తెలుగులో కూడా ఇంకోసారి ఇంకో ఇన్నింగ్స్ కి రెడీ అంటున్నారు లైలా. కుర్ర హీరోలకు తల్లి పాత్రలకు, పెద్ద హీరోలకు సిస్టర్ రోల్స్ కి సూట్ అవుతుంది.

‘సర్దార్’ సినిమా ప్రొమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన లైలా ఇలా దర్శనమిచ్చింది. ఆమెకిద్దరు పిల్లలు. కానీ, ఆమె మళ్ళీ యాక్టింగ్ పై ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది.

 

More

Related Stories