వాళ్ళు కలిసే ఉన్నారు!

వాళ్ళు కలిసే ఉన్నారు!
లక్ష్మీ ప్రసన్న ఇప్పటికీ లక్ష్మీ మంచుగానే పాపులర్. పెళ్లి అయినా ఆమె తన ఇంటి పేరును మార్చుకోలేదు. అంతే కాదు, ఆమె తన మకాం కూడా మార్చలేదు. తన కూతురితో కలిసి హైదరాబాద్ లోనే ఉంటూ కెరీర్ కొనసాగిస్తోంది. ఆమె భర్త ఆండీ శ్రీనివాసన్ మాత్రం అమెరికాలో ఉంటున్నారు.

దాంతో, ఆమె భర్త నుంచి వేరుపడింది అని కొంతకాలంగా గాసిప్ నడుస్తోంది. అది అబద్దమని తాజాగా నిరూపితమైంది. మనోజ్ పెళ్ళిలో ఆండీ శ్రీనివాసన్ ప్రత్యక్షమయ్యారు. లక్ష్మీ పక్కనే ఆండీ ఉన్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

ఈ ఫోటోలను బట్టి లక్ష్మి, ఆండీ భార్యాభర్తలుగానే కొనసాగుతున్నారు అని అర్థం అవుతోంది. వారి విడాకుల వార్తలు నిరాధారం. హీరో, హీరోయిన్ల జీవితాల గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అలాంటిదే ఇది.

లక్ష్మి, ఆండీ 2006లో పెళ్లి చేసుకున్నారు. ఆండీ అసలు పేరు ఆనంద్. ఆయన ఒక ఐటీ వ్యాపారవేత్త. వీరికి ఒక అమ్మాయి.

 

More

Related Stories