అన్ని భాషల్లో పొంగల్ కే!

- Advertisement -
Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటిస్తున్న చిత్రం… “లాల్ సలాం”. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది. ఐతే, ఇటీవలే తన చిత్రం “కెప్టెన్ మిల్లర్” కూడా సంక్రాంతికి విడుదల కానుంది అని హీరో ధనుష్ ప్రకటించాడు. దాంతో, తన మాజీ అల్లుడుతో రజినీకాంత్ పోటీ పడకపోవచ్చనే మాట వినిపించింది.

అదీ కాకుండా తెలుగులో నాలుగు, ఐదు చిత్రాలు సంక్రాంతికే విడుదల అవుతున్నాయి. దాంతో, “లాల్ సలాం” కేవలం తమిళంలోనే పొంగల్ కి వస్తుందేమో, ఇతర భాషల్లో వేరే డేట్ కి ఫిక్స్ చేస్తారేమో అన్న మాట కూడా వైరల్ అయింది. ఐతే, ఈ ఊహాగానాలకు తెరదించింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.

పొంగల్ కి విడుదల విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అని తాజాగా లైకా సంస్థ పోస్ట్ చేసింది.

“లాల్ సలాం” చిత్రానికి దర్శకురాలు ఐశ్వర్య. ఆమె రజినీకాంత్ పెద్ద కూతురు, ధనుష్ మాజీ భార్య. ఇక ఈ సినిమాలో విష్ణు విశాల్ (గుత్తా జ్వాలా భర్త) హీరో. రజినీకాంత్ మొహిన్ అనే మాఫియా నాయకుడిగా అరగంట పాటు ఉండే పాత్రలో కనిపిస్తాడట.

 

More

Related Stories