లలిత్ మోడిని పెళ్లాడనున్న సుష్మిత!

Lalith Modi and Sushmita Sen


లలిత్ మోడి గుర్తున్నాడా? ఐపీఎల్ ఆటలు మొదలుపెట్టింది ఆయనే. ఆర్థిక నేరాల కేసులో ఇరుక్కొని దేశం వదిలి పారిపోయారు లలిత్ మోడి. ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. లేటెస్ట్ గా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ బాగా వైరల్ అయింది.

హీరోయిన్ సుష్మిత సేన్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఆమె తన ‘బెటర్ హాఫ్’ అని రాసుకున్నాడు. దాంతో, అందరూ కంగ్రాట్యులేషన్స్ తెలిపారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ సుష్మితకి కూడా శుభాకాంక్షలు చెప్పారు. కాసేపటికి ఆయన క్లారిటీ ఇచ్చారు.

“క్లారిటీ కోసం రాస్తున్నా. ఇంకా పెళ్లి కాలేదు. ప్రస్తుతానికి డేటింగ్ లో ఉన్నాం. ఆ ముచ్చట (పెళ్లి) కూడా తీరుతుంది త్వరలో,” అని ట్వీట్ చేశారు లలిత్.

లలిత్ కి 56 ఏళ్ళు. సుష్మితకి 46 ఏళ్ళు. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. లలిత్ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నాడు. సుస్మిత తన జీవితంలోకి వచ్చిందని అంటున్నాడు.

 

More

Related Stories