
లాంబోర్గిని కార్లు అంటే సూపర్ స్టార్లకు మహా సరదా. రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్, రామ్ చరణ్, ప్రభాస్, వంటి పలువురు పెద్ద స్టార్స్ వీటిని కొన్నారు. దాదాపు మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఉంటుంది దీని ధర. ఈ కారు ఇపుడు ఎన్టీఆర్ ఇంటికి చేరింది.
ఎన్టీఆర్ కి కూడా లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన కూడా ముచ్చటపడి కొన్నారు. ఇటీవలే అతని ఇంటికి చేరింది.
టాలీవుడ్ లో దాదాపు అందరి బడా హీరోలకు లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు హీరోల పారితోషికాలు కూడా భారీగా పెరిగాయి. దాంతో, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడంతో పాటు లగ్జరీ కార్లపై ఖర్చు చేస్తున్నారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం “ఆర్ ఆర్ ఆర్” సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో ఈస్ట్ యూరోప్ వెళ్తారు. అక్కడే చివరి సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఇక ఆగస్టు 15న ఎన్టీఆర్ హోస్ట్ చేసే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో మొదలు కానుంది.