బిగ్ బాస్ 4 మరింత హాట్ గా

Poonam Bajwa

ఇప్పటివరకు జరిగిన సీజన్లలో కేవలం క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ల కోసమే చూశారు. హాట్ గా కనిపించే ముద్దుగుమ్మల కోణంలో సెర్చ్ చేయలేదు. అలాంటి కోణం ఉన్నప్పటికీ వాళ్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీలకే పరిమితం చేశారు. గతంలో అలా ఎంట్రీ ఇచ్చి వైల్డ్ గా రెచ్చిపోయిన ముద్దుగుమ్మలున్నారు. అయితే ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి మరింత హీట్ ను పంప్ చేయాలని చూస్తోంది యాజమాన్యం. సెన్సేషనల్ సెలబ్రిటీలతో పాటు హాట్ లేడీస్ ను గదిలో పెట్టి బంధించాలని చూస్తున్నారు.

ఈసారి హౌజ్ లోకి హంసానందిని ఎంట్రీ ఇస్తుందని కొందరంటున్నారు. మరికొంతమంది పూనమ్ కౌర్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. వీళ్లతో పాటు తను హౌజ్ లోకి వెళ్లనంటూ మారాం చేస్తున్న శ్రద్ధాదాస్ లాంటి అందగత్తెలు కూడా ఆఖరి నిమిషంలో అందరికీ షాకిస్తూ బిగ్ బాస్ హౌజ్ లోకి  ఎంటరయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. తాజాగా ఈ లిస్ట్ లో పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

మొత్తమ్మీద ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో అందగత్తెలు కాస్త ఎక్కువగానే కనిపించే అవకాశాలున్నాయి. నిర్వహకులు ఈ కోణంలోనే వేట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు బిత్తిరి సత్తి లాంటి పించ్ హిట్టర్లు రేసులో ఉండనే ఉన్నారు.  

మరోవైపు బిగ్ బాస్ సీజన్-4కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల మారిన పరిస్థితులు, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ వంద రోజుల నుంచి కుదించాలని అనుకుంటున్నారట. సీజన్-3కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జునే, సీజన్-4కు కూడా వ్యాఖ్యాతగా కొనసాగే అవకాశాలున్నాయి.

Related Stories