
పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించిన స్వాతి దీక్షిత్ ఒక కేసులో ఇరుక్కొంది. ఆమె ఒక ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది అని ఆరోపణలు.
హైదరాబాద్ లోని సంపన్నుల ప్రాంతమైన జూబ్లీహిల్స్ లో 30 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని కబ్జా కోసం యత్నం చేసిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో స్వాతి దీక్షిత్ కూడా ఉంది.
లీజు వ్యవహరంలో ఇంటి యజమానురాలు (ఆమె అమెరికాలో ఉంటారు) , స్వాతి దీక్షిత్ మధ్య ఏడాది కాలంగా కి వివాదం నడుస్తోంది. కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. తాజాగా ఆ ఇంట్లోకి దుండగులు దౌర్జన్యంగా ప్రవేశించారు ఇంటి వాచ్ మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాంతో స్వాతి దీక్షిత్ తో పాటు చింతల ప్రశాంత్, రణ్వీర్ సింగ్, కండె రామ్ కుమార్ సహా 20 మందిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
స్వాతి దీక్షిత్ రామ్ గోపాల్ వర్మ తీసిన కొన్ని చిత్రాలతో పాటు “గమ్మత్తు” అనే సినిమాలో నటించారు. అనేక చిత్రాల్లో చిన్న చిన్న పత్రాలు కూడా పోషించారు.