
బిగ్ బాస్ హౌజ్ లో వరుసగా షాకులిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది లాస్య మాత్రమే. హౌజ్ లో అడుగుపెట్టిన రోజు నుంచి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక్కో సీక్రెట్ బయటపెడుతూ జనాలకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది ఈ యాంకర్.
తాజాగా లాస్య మరో బాంబ్ పేల్చింది. తన ప్రేమ-పెళ్లికి సంబంధించి ఇంకో సీక్రెట్ బయటపెట్టింది. Bigg Boss Telugu 4 – Episode 68 లో రాత్రి బిగ్ బాస్ హౌజ్ లో ఓ ఇంట్రెస్టింగ్ టాస్క్ జరిగింది.
అదేంటంటే.. ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పని ఓ సీక్రెట్ ను హౌజ్ మేట్స్ అంతా బయటపెట్టాలి. ఆ సీక్రెట్ ఎలా ఉండాలంటే.. తమ ఆప్తులకు కూడా అది తెలిసి ఉండకూడదు. ఈ టాస్క్ లో భాగంగా లాస్య చెప్పిన మేటర్ విని అంతా అవాక్కయ్యారు.
లాస్య ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమె కంటే చిన్నోడంట. ఈ విషయాన్ని లాస్య స్వయంగా బయటపెట్టింది. ఆ విషయం తనకు కూడా తెలియదని, ప్రేమించిన తర్వాత చాన్నాళ్లకు తనకు తెలిసిందంటున్న లాస్య.. తన లవర్ తనకంటే ఏడాది చిన్న అని తెలిస్తే అస్సలు ఇంట్లో ఒప్పుకోరని ఎవ్వరికీ చెప్పలేదంటోంది. బిగ్ బాస్ హౌజ్ వేదికగా ఈ సీక్రెట్ ను బయటపెట్టిన లాస్య.. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు సారీ చెప్పింది.
అంతేకాదు.. అంతా అనుకుంటున్నట్టు తన భర్త సౌండ్ పార్టీ కాదంటోంది. మహారాష్ట్రకు చెందిన తన భర్త మధ్యతరగతి కంటే దిగువస్థాయి వ్యక్తి అని, ఆ విషయం కూడా చాలామందికి తెలియదని చెప్పుకొచ్చింది.
ఇలా మినిమం గ్యాప్స్ లో సంచలన విషయాలు బయటపెడుతున్న లాస్య, సీజన్-4 పూర్తయ్యేలోపు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.