ఆస్పత్రిలో చేరిన లతా మంగేష్కర్

- Advertisement -
Lata Mangeshkar


‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన భారతరత్న లతా మంగేష్కర్ కి కూడా కరోనా సోకింది. ఆమె వయసు రీత్యా వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇస్తున్నారు.

“కోవిడ్ తో పాటు న్యుమోనియాతో బాధ పడుతున్నారు. శనివారమే ఆమె ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఆందోళన చెందాల్సిందేమి లేదు,” అని లతా మంగేష్కర్ ని పరీక్షిస్తున్న డాక్టర్లు తెలిపారు. లతా మంగేష్కర్ కి 92 ఏళ్ళు.

భారత సినిమా సంగీత ప్రపంచంలో ఆమెకి సాటి వచ్చే గాయని లేరు. భారతరత్న అందుకున్న ఏకైక సినిమా గాయని లతా మంగేష్కర్.

 

More

Related Stories