ఆ మూడు ఇష్టం: లావణ్య

చాలాసార్లు నెట్ లో ఛాటింగ్ చేసింది కానీ లావణ్యకు ఎప్పుడూ ఇలాంటి ప్రశ్నలు ఎదురవ్వలేదు. ఈసారి మాత్రం ఆమెకు ఎక్కువగా ప్రేమ-పెళ్లి-నిశ్చితార్థం లాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. వాటితో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కు ‘లావణ్యం’గా ఇచ్చిన సమాధానాలు చూద్దాం.

  • ఆత్రుత, ఓవర్ థింకింగ్ ను ఎలా అధిగమిస్తారు?
    ఆత్రుత, గాబరా మొదలైనప్పుడు భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తా. లేదంటే నా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాను. పనికిరాని విషయాలపై టైమ్ వేస్ట్ చేయడం ఎందుకు?
  • రోజూ డైరీ రాస్తారా?
    నిజంగా రాయాలనుకుంటాను.. కానీ రాయలేను

  • ఐపీఎల్ గురించి?
    సన్ రైజర్స్ ను నేను సపోర్ట్ చేస్తాను. రాజస్థాన్ రాయల్స్ కూడా ఇష్టం.

  • వేలికి ఉంగరం ఉంది.. పెళ్లి ఎప్పుడు?
    వేలికి ఉంగరం ఉంటే అదే అర్థమా? అమ్మాయిల వేళ్లకు ఉంగరాలు ఉండకూడదా? నా బర్త్ డేకు నేను కొనుక్కున్న ఉంగరం అది.
  • ఇంతకీ పెళ్లి ఎప్పుడు?
    మా అమ్మానాన్నకు కూడా లేని తొందర మీకు ఎందుకు?
    
  • ట్రెండ్స్ అంటే ఇష్టమా?
    అవును.. నాకు ట్రెండ్స్ అంటే ఇష్టమే. ఫాలో అవుతుంటా కూడా.
    
  • చావు కబురు చల్లగా, ఎ-1 ఎక్స్ ప్రెస్ సినిమాల్లో ఏదిష్టం.
    రెండూ ఇష్టమే.. రెండు సినిమాలపై చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాను.
    
  • ఇష్టమైన ఫుడ్, డ్రింక్
    అన్నం-పప్పు-చట్నీ అంటే చాలా ఇష్టం. ఇక డ్రింక్స్ లో టీ అంటే ఇష్టం. కానీ పాలు తక్కువగా ఉండాలి.
    
  • ఏ ఊరిలో ఎక్కువగా ఉంటారు?
    హైదరాబాద్, డెహ్రాడూన్, ముంబయి. ఈ మూడు నగరాలూ ఇష్టం.
Advertisement
 

More

Related Stories