
లావణ్య త్రిపాఠి ఈ ఏడాది స్టార్టింగ్ లోనే సందడి చేయనుంది. ఆమె నటించిన ‘A1 ఎక్స్ ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ కూడా తక్కువ గ్యాప్ లోనే బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కానున్నాయి.
‘A1 ఎక్స్ ప్రెస్’… ఇది స్పోర్ట్స్ డ్రామా. సందీప్ కిషన్ హీరో. లావణ్య సందీప్ కి జోడి. అంతే కాదు, ఈ సినిమాలో ఆమె కూడా సందీప్ యాక్ట్ చేసినట్లే హాకీ ప్లేయర్ పాత్ర పోషించింది. ఈ రోల్ కోసం ఆమె స్పెషల్ గా హాకీలో ట్రైనింగ్ తీసుకొంది. ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది ‘A1 ఎక్స్ ప్రెస్’.
‘A1 ఎక్స్ ప్రెస్’ విడుదలైన 25 రోజులకే ఆమె నటించిన మరో సినిమా థియేటర్లోకి రానుంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తీస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమా రిలీజ్ డేట్ ని లేటెస్ట్ గా ప్రకటించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాకి బన్నీ వాసు నిర్మాత. మర్చి 19న విడుదల కానుంది ‘చావు కబురు చల్లగా’.
రెండూ కూడా పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. ఈ రెండూ ఆడుతాయని లావణ్య ధీమాగా ఉంది.