ఓటీటీలోకి మరో హీరోయిన్?

Lavanya OTT

ఇప్పటికే సమంత ఓటీటీలోకి ఎంటరైంది. ఆమె నటించిన “ఫ్యామిలీమేన్-2” వెబ్ సిరీస్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇషా రెబ్బా ఆల్రెడీ 2 వెబ్ సిరీస్ లు చేస్తోంది. రాశిఖన్నా, పాయల్ లాంటి హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్ లు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి లావణ్య త్రిపాఠి కూడా చేరబోతోంది.

వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించాడు దర్శకుడు మారుతి. తన దర్శకత్వ పర్యవేక్షణలో, శిష్యుడ్ని డైరక్టర్ గా పరిచయం చేస్తూ ఓ సిరీస్ చేయబోతున్నాడు. ఇందులో లావణ్య త్రిపాఠిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు చర్చలు పూర్తయినట్టు తెలుస్తోంది.

మారుతి దర్శకత్వంలో వచ్చిన “భలే భలే మగాడివోయ్” సినిమాలో లావణ్య హీరోయిన్ గా నటించింది. ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఇది కూడా ఒకటి. కాబట్టి మారుతి అడిగితే లావణ్య నో చెప్పే అవకాశాలు తక్కువ.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కార్తికేయ సరసన “చావుకబురు చల్లగా”, సందీప్ కిషన్ తో “ఏ-1 ఎక్స్ ప్రెస్” సినిమాలు చేస్తోంది. తాజా వెబ్ సిరీస్ పై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది.

Related Stories