లావణ్య కొత్త అవతారం

లావణ్య త్రిపాఠి ఇక నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది. ఆమె కూడా డిజిటల్ రంగంలోకి వచ్చింది. అలాగే యాక్షన్ బాట పట్టింది.

లావణ్య త్రిపాఠి కూడా వెబ్ సిరీస్ లలో నటించడం మొదలు పెట్టింది. ఆమె నటించిన మొదటి వెబ్ సిరీస్… మేక పులి. కోన వెంకట్ సమర్పణలో మెదలైన ఈ వెబ్ సిరీస్ లో ఆమె పూర్తిగా యాక్షన్ రోల్ చెయ్యడం విశేషం. అంతే కాదు, ఆమె తొలిసారిగా పోలీస్ పాత్ర పోషించింది.

ఖాకీ పాత్రతో పాటు ‘బోనాలు’ సమయంలో రంగం చెప్పే అవతారంలో కూడా దర్శనమివ్వనుంది. ఇలా ఎన్నో కొత్త అవతారాలు ఈ ఒక్క వెబ్ సిరీస్ లో లావణ్య చూపిస్తోంది. జీ5లో త్వరలోనే స్ట్రీమ్ కానుంది.

లావణ్య ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ ని కాపాడుకుంటూ హీరోయిన్ గా ఇంకా అవకాశాలు పొందుతూనే ఉంది. ఆమెకి అవకాశాలు తగ్గాయి అనుకున్న ప్రతిసారీ కొత్తగా మన ముందుకొస్తోంది.

 

More

Related Stories