ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా?

- Advertisement -

చాలా మ్యాగజైన్స్ లో, పేపర్లలో ఈ తరహా కాలమ్స్ చూస్తుంటాం. హీరోయిన్ల చిన్నప్పటి ఫొటోలు లేదా మేకప్  లేకుండా ఉన్న ఫొటోల్ని ప్రచురించి, ఈ హీరోయిన్ గుర్తుపట్టారా అంటూ టీజ్ చేస్తారు.. సమాధానం కావాలంటే ఫలానా పేజీ చూడండి అంటుంటారు. ఇప్పుడీ రకమైన పజిల్స్ సోషల్ మీడియాకు ఎక్కాయి. స్వయంగా హీరోయిన్లు రకరకాల గెటప్స్ వేసుకొని గుర్తుపట్టారా అని అడగడం సర్వసాధారణమైంది.

దీనికితోడు కొత్తగా-చెత్తగా చూపించే యాప్స్ కూడా రకరకాలు పుట్టుకురావడంతో ఇలాంటివి ట్రై చేసి సరదా పడుతుంటారు హీరోయిన్లు. ఈ లిస్ట్ లో నంబర్ వన్ స్థానం మాత్రం శృతిహాసన్ దే. కనీసం రోజుకు ఒకటైనా ఇలాంటి పిచ్చి స్టిల్ పెట్టి టీజ్ చేస్తుంది ఈ అమ్మడు. ఇప్పుడీ లిస్ట్ లోకి లావణ్య త్రిపాఠి కూడా చేరిపోయింది.

లావణ్య త్రిపాఠి దెయ్యమైతే ఎలా ఉంటుంది? దీని కోసం ఎవరూ పెద్దగా కష్టపడకుండా, తనే స్వయంగా దెయ్యం లుక్ లోకి మారింది. హాలోవీన్ ఫిల్టర్ ఉపయోగించి తన ముఖాన్ని ఇలా భూతంగా మార్చుకుంది.

అందాల సుందరిని ఈ యాంగిల్ లో కూడా చూసేయండి మరి. 

 

More

Related Stories