
ఈ లాక్ డౌన్ లో ఎక్కువమంది హీరోయిన్లు చేసిన పని ఏదైనా ఉందంటే, అది కుకింగ్ మాత్రమే. వంటింట్లో తనకు తోచిన ప్రయోగాలన్నీ చేశారు ముద్దుగుమ్మలు. రకరకాల రెసిపీలు తయారుచేసి ఆ ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో కుమ్మరించారు. ఓవైపు అన్ లాక్ మొదలైనా, లావణ్య త్రిపాఠి మాత్రం తన వంటల కార్యక్రమం ఆపలేదు.
టైమ్ దొరికినప్పుడల్లా కొత్త కొత్త వంటకాలు ట్రై చేసే లావణ్య, ఈ వీకెండ్ కూడా అలాంటి ప్రయత్నమే చేసింది. “చాక్లెట్ కేక్ విద్ వెనీలా ఐస్ క్రీమ్” చేసి ఫొటో పెట్టింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు వావ్ అంటూ సర్ ప్రైజ్ అవుతున్నారు.
మరికొందరైతే మరో అడుగు ముందుకేసి, లావణ్య త్రిపాఠి ఇకపై రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టొచ్చంటూ ఉచిత సలహాలిస్తున్నారు.
ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి. లావణ్య వంటకం చూస్తే ఎవరికైనా నోరూరడం గ్యారెంటీ. ప్రస్తుతం ఈ బ్యూటీ “ఏ-1 ఎక్స్ ప్రెస్”, “చావు కబురు చల్లగా” సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు త్వరలోనే మరో 2 ప్రాజెక్టులు ఎనౌన్స్ చేయబోతోంది ఈ ఉత్తరాఖండ్ బ్యూటీ.