హీరోపై లవ్వు, బయటపడ్డ లావణ్య!

- Advertisement -
Lavanya Stills 020422 002


హీరోయిన్ లావణ్య త్రిపాఠికి, హీరో వరుణ్ తేజ్ కి మధ్య కుచ్ కుచ్ హై అని అంటారు జనం. కానీ వరుణ్ తేజ్ మాత్రం అది రూమర్ అని కొట్టిపారేశారు. వరుణ్ తేజ్ తాజగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే మాట. ఆ ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

వరుణ్ తేజ్ మాట ఎలా వున్నా లావణ్య మాత్రం బయటపడి పోయింది. అతనిపై తన అభిమానాన్ని చాటుకొంది. వరుణ్‌ తేజ్‌హీరోగా నటించిన గని చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 8) ప్రేక్షకుల ముందుకు రానుంది. “వరుణ్‌.. ఈ పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫర్ట్ పెట్టావని తెలుసు. నీతో పాటు నీ టీం చేసిన హార్డ్‌ వర్క్‌కి తగిన ప్రతిఫలం దక్కాలని ప్రార్థిస్తున్నా” అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

ప్రతివారం ఒక సినిమా విడుదల అవుతూనే ఉంది. కానీ, ఏ సినిమాకి ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ చెప్పని లావణ్య ‘గని’ సినిమా కోసం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్ట్ పెట్టింది.

ఇలా ప్రత్యేకంగా వరుణ్ కి విషెస్ చెప్పడంతో వీరిపై ఉన్న రూమర్లు నిజమే కాబోలు అని కామెంట్స్ చేస్తున్నారు వారి ఫ్యాన్స్. వరుణ్ తేజ్, లావణ్య మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో నటించారు. ఆ టైంలోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇటీవల ఇద్దరూ డేటింగ్ మొదలుపెట్టారని, పెళ్లి ఆలోచన కూడా చేస్తున్నారని ప్రచారం జరిగింది.

More

Related Stories