బాంబు లేదు… లక్ష్మి మిగిలింది

Laxmmi Bomb

రాఘవ లారెన్స్ హిందీలో తీసిన మొదటి సినిమా ..డైరెక్ట్ గా డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతోంది. నవంబర్ 9న స్ట్రీమ్ అవుతుంది. ఐతే ఈ సినిమా టైటిల్ చేంజ్ అయింది. “లక్ష్మి బాంబు” అనే టైటిల్ నుంచి బాంబు ఎగిరిపోయింది. సినిమా టైటిల్ ఇప్పుడు…లక్ష్మి మాత్రమే.

లక్ష్మి దేవత పేరు పెట్టి బాంబు అని అవమానిస్తారా అని వివాదం రేపడంతో టైటిల్ లో మార్పు వచ్చింది. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. “కాంచన” సినిమాకి రీమేక్.

లారెన్స్ ఈ సినిమాతో నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు. కొన్నాళ్లుగా “కాంచన” సినిమా కథనే 2,3, 4… అంటూ తిప్పి తిప్పి అదే తీస్తున్న లారెన్స్ ఇప్పుడు దాన్నే హిందీలో రీమేక్ చేసాడు. ఆయన ఐడియాల్లో మిగిలిన “పిప్పి” ఇదే కాబోలు.

Related Stories