తుస్సుమన్న లక్ష్మిబాంబ్ ట్రైలర్

అక్షయ్ కుమార్, కియారా అద్వానీ నటించిన “లక్ష్మిబాంబ్” ట్రైలర్ నిన్న (శుక్రవారం) విడుదలైంది. 24 గంటల్లో ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో 8 మిలియన్లకి (80 లక్షలు) పైగా వ్యూస్ వచ్చాయి. అక్షయ్ కుమార్ రేంజ్ కి ఈ వ్యూస్ చాలా తక్కువ. రెండు నెలల క్రితం విడుదలైన అలియా భట్ మూవీ “సడక్ 2” ట్రైలర్ కి 24 గంటల్లో 10 మిలియన్ల (కోటి) వ్యూస్ వచ్చాయి. అలియా భట్ సినిమా కన్నా అక్షయ్ కుమార్ మూవీ ట్రైలర్ కి తక్కువ వ్యూస్ రావడం అంటే సీన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఐతే టీం మాత్రం యూట్యూబ్, ఫేస్బుక్, ఇతర మాధ్యమాల్లో కలిపి 70 మిలియన్ వ్యూస్ వచ్చాయి….ఇది రికార్డు అని పబ్లిసిటీ చేసుకుంటుంది. ఇదొక ఫికు గిమ్మిక్.

Laxmmi Bomb | Official Trailer | Akshay Kumar | Kiara Advani | Raghav Lawrence | 9th November

సడక్ 2కి వ్యూస్ తో పాటు సింగిల్ డేలో 56 లక్షల డిస్ లైకులు కూడా వచ్చాయి. సడక్ 2 ట్రైలర్ దెబ్బకే…. లక్ష్మిబాంబ్ సినిమా ట్రైలర్ కి డిస్ లైకులు, లైకులు కనపడకుండా సెట్టింగ్స్ మార్చారు. అలా “లక్ష్మిబాంబ్” టీం బయటపడింది.

“లక్ష్మిబాంబ్” తెలుగు, తమిళంలో వచ్చిన “కాంచన” సినిమాకి రీమేక్. హిందీలో కూడా ఈ మూవీని లారెన్స్ డైరెక్ట్ చేశాడు. వచ్చే నెల 9న హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ అవుతోంది. థియేటర్లో రిలీజ్ కాదు. కియారా అద్వానీ ఈ ఏడాది గిల్టీ అనే వెబ్ మూవీని కూడా రిలీజ్ చేసింది.

Related Stories