
విజయ్ దేవరకొండకి యూత్ లో క్రేజ్ ఉందనేది అందరికీ తెలుసు. కానీ, బీహార్లో, బెంగళూరులో కూడా దేవరకొండని చూసేందుకు అభిమానులు వరదలా రావడం కొంత ఆశ్చర్యమే.
‘లైగర్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా యూత్ ఎగబడుతున్నారు. ముంబై, పాట్నా, కొచ్చి, గుంటూరులలోనే కాదు బెంగుళూరులోనూ అదే క్రేజ్ కనిపించింది.
ఇటీవల బెంగుళూరు వెళ్లారు విజయ్ దేవరకొండ ప్రమోషన్ కోసం. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించి ఈవెంట్ లో పాల్గొన్నారు. ఎయిర్ పోర్టు నుంచే అభిమానుల హంగామా కనిపించింది. విజయ్ వెంటపడడం, సెల్ఫీలు తీసుకోవడం, ఆయన దగ్గరకు రాగానే ఎమోషన్ అవడం చూస్తుంటే విజయ్ కి ఇంత క్రేజ్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. క్రౌడ్ ని అదుపుచేయడం కోసం పోలీసులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు.
‘లైగర్’ ఈ నెల 25న విడుదల కానుంది.