జనం జనం… ‘లైగర్’ క్రేజ్ అది

- Advertisement -
Liger song


విజయ్ దేవరకొండకి బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా క్రేజ్ ఉందా? అతను ఇంతవరకు హిందీ సినిమాలు చెయ్యలేదు. కానీ, పాట్నాలో కూడా విజయ్ ని చూసేందుకు జనం ఎగబడడం నమ్మశక్యం కావడం లేదు. కానీ నిజంగా అలా జరుగుతోందట.

“లైగర్” ప్రచారం కోసం విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా జనం పోటెత్తుతున్నారు. ఈ క్రౌడ్ ను కంట్రోల్ చేయలేక ఈవెంట్స్ క్యాన్సల్ చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయట.

ఇటీవల నవీ ముంబైలో జరిగిన లైగర్ ఈవెంట్ జనసంద్రంగా మారిపోయింది. అదే సీన్ బీహార్ రాజధాని పాట్నాలోనూ కనిపించింది. అక్కడి ఏఎన్ కాలేజీలో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ కూడా ముంబైలాగే భారీ జన సమూహం వల్ల ఈవెంట్ రద్దు చేశారు.

ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది లైగర్. ఈ సినిమా ప్రమోషన్ కోసం విజయ్ దేవరకొండ అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నాడు.

 

More

Related Stories