లైగర్ అసలు ఫైట్ మొదలైంది

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లైగర్’ కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు మొదలైంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత షూటింగ్ షురూ అయింది. ఈ సినిమాకి సంబంధించిన ఒక మెయిన్ యాక్షన్ ఎపిసోడ్ ని నేటి నుంచి తీస్తున్నారు. దేవరకొండ భారీ బిల్డప్ తో కనిపిస్తాడు ఈ ఫైట్ లో. సినిమా కథకి కీలకమైన సన్నివేశాలు ఇవి.

షూటింగ్ మొదలైందంటూ విజయ్ దేవరకొండ లొకేషన్ లో కూర్చున్న ఫోటోని షేర్ చేశారు నిర్మాత ఛార్మి. విజయ్ కూర్చున్న తీరు, అతని ఫిజిక్ చూస్తుంటే … అర్థం అవుతుంది బాక్సింగ్ ఫైట్లు ఈ రేంజులో ఉండబోతున్నాయో. వచ్చే రెండు నెలల్లో మొత్తం షూటింగ్ ని పూర్తి చెయ్యాలి అని టార్గెట్ పెట్టుకున్నారు.

బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బాక్సింగ్ డ్రామా వచ్చే ఏడాది విడుదల కానుంది. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ తల్లి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా బాక్సాఫీస్ విజయం విజయ్ కి కీలకం. ఇంతకుముందు వరుసగా మూడు ప్లాపులు వచ్చాయి దేవరకొండకి.

ఈ సినిమా పూర్తి అయిన తర్వాత విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్ చేస్తాడనుకోవచ్చు.

 

More

Related Stories