‘లైగర్’ మేకోవర్ అదిరింది!


విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ థీమ్ సాంగ్ బయటికి వచ్చింది. ఈ పాటలో విజయ్ దేవరకొండ పడిన కష్టం, అతని సరికొత్త మేకోవర్ కనిపించింది. ఇప్పటివరకు స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా చాలా సినిమాలు వచ్చాయి. బాక్సర్ గా పలువురు హీరోలు కనిపించారు. కానీ, స్పోర్ట్స్ డ్రామాలల్లో పాత్ర కోసం పూర్తిగా మారిపోయి అదరగొట్టిన హీరోల్లో ఫర్హాన్ అక్తర్ ముందు నిలుస్తారు. మిల్కా సింగ్ గా ఫర్హాన్ మారిపోయిన తీరు అద్భుతం.

‘లైగర్’ పాట చూస్తుంటే… విజయ్ దేవరకొండ కూడా అదరగొట్టాడనిపిస్తోంది. అతని ట్రాన్సఫార్మేషన్ సూపర్.

ఐతే, ఇప్పటికే ఎన్నో బాక్సింగ్ చిత్రాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఈ సినిమా ఉండగలదా అన్నదే ప్రశ్న. ఈ సినిమాకున్న మరో ఆకర్షణ… మైక్ టైసన్. బాక్సింగ్ లో మైక్ టైసన్ ఒక దిగ్గజం. ఒక లెజెండ్. అలాంటి బాక్సర్ విజయ్ దేవరకొండ సినిమాలో నటించడం విశేషం.

విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు పని చేశాడు. అతని కష్టానికి పాన్ ఇండియా లెవల్లో ఫలితం రావాలని ఆశిద్దాం.

 

More

Related Stories