షూటింగ్ ఆపేసిన లైగర్

- Advertisement -
Liger

కరోనా మూడో వేవ్ వచ్చింది. మూడో వేవ్ అనే పేరులేదు కానీ పెరుగుతున్న కేసుల సంఖ్య అలాగే ఉంది. దాంతో, సినిమా ఇండస్ట్రీలో షూటింగులు నిలిచిపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ‘లైగర్’ షూటింగ్ ని నిలిపివేసినట్లు ప్రకటించింది టీం. హీరో విజయ్ కూడా అదే తెలుపుతూ తన కుక్కతో రిలాక్స్ అవుతున్న ఫోటోని షేర్ చేశాడు.

పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘లైగర్’ షూటింగ్ 2020 జనవరి మొదలైంది. రెండు నెలలు కాగానే కరోనా మొదటి వేవ్ వచ్చింది. ఇక 2021లో కొంత భాగం షూట్ చేశారు. మళ్ళీ రెండో వేవ్ వచ్చింది. రీసెంట్ గా అమెరికా వెళ్లి కీలకమైన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసి వచ్చారు. 2022 జనవరిలో సినిమాకి గుమ్మడికాయ కొడుదామని ప్లాన్ చేసుకుంటుండగా మూడో వేవ్ వచ్చింది. దాంతో షూటింగ్ కి ఇంకోసారి బ్రేక్ పడింది.

ఇలా ‘లైగర్’ షూటింగ్ పూర్తి కాకుండా కరోనా వేవులు అడ్డుపడుతున్నాయి.

ఈ సినిమా పూర్తి అయిన తర్వాతే కొత్త సినిమా ప్రకటిస్తాడు విజయ్ దేవరకొండ. ఈ హీరో దీనిమీద చాలా నమ్మకంగా ఉన్నాడు.

 

More

Related Stories