రవితేజ మరోసారి లిప్ లాక్!


రవితేజ ఇటీవల వరుసగా ముద్దు సీన్లు చేస్తున్నారు. హీరోయిన్లతో పాటలల్లోనో, రొమాంటిక్ సీన్లలలోనో కిస్ మీ అంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో కూడా హీరోయిన్ దివ్యాంశ కౌశిక్‌తో పెదవులు కలిపేశారు.

రవితేజ, దివ్యాంశ కౌశిక్‌లపై చిత్రీకరించిన “సొట్టల బుగ్గల్లో” అనే పాట విడుదల చేసింది సినిమా టీం. ఈ పాట కోసం సంగీత దర్శకుడు సామ్ సిఎస్ రొమాంటిక్ మెలోడీ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ పాటలో రవితేజ, దివ్యాంశ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ పాటలోనే వీరు లిప్ లాక్ కానిచ్చేశారు.

50 ప్లస్ వయసులో రవితేజ రొమాన్స్ విషయంలో దూకుడుగా ఉన్నారు. రీసెంట్ గా ‘ఖిలాడీ’ చిత్రంలో ఇలాగే నటించారు. బహుశా ఇక రవితేజ నటించే ప్రతి సినిమాలో ముద్దు సీను ఉంటుందేమో.

”రామారావు ఆన్ డ్యూటీ’ జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Sottala Buggallo - Lyrical | Ramarao On Duty | Ravi Teja, Divyansha Kaushik | Sam CS|Sarath Mandava
 

More

Related Stories