లాక్డౌన్ వల్లే పెళ్లి చేసుకుందట

Sunitha and Ram

సింగర్ సునీత గత నెలలో రెండో పెళ్లి చేసుకొంది. మొదటి భర్త నుంచి విడిపోయిన పదేళ్ల తర్వాత ఆమె పెళ్లాడింది. అది కూడా కూతురు, కొడుకు 20 ఏళ్ల వయసుకు వచ్చాక పెళ్లి చేసుకోవడంతో జనం మాటల్లో ఒక మెయిన్ టాఫిక్ అయింది. అంతే కాదు… ఆమెని పెళ్లి చేసుకోవాలని రాజకీయవేత్తలు, సింగర్స్, నటులు ఇలా ఎందరో ప్రయత్నించారని, ప్రొపోజ్ చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ సునీత మాత్రం తన పిల్లల పెంపకంపైనే ధ్యాస నిలిపి మళ్ళీ పెళ్లి గురించి ఆలోచన చెయ్యలేదు.

అలాంటి సునీత రామ్ సూరపనేని ప్రొపోజల్ కి ఎలా ఒప్పుకొంది? దానికి సమాధానం ఇచ్చిందిప్పుడు. పెళ్లి తర్వాత సునీత మొదటిసారిగా యాంకర్ సుమకి ఇంటర్వ్యూ ఇచ్చింది.

“లాక్డౌన్ నా ఆలోచనని మార్చేసింది. అంతకుముందు చాలా సార్లు అతని ఫోన్ కాల్స్ ని లిఫ్ట్ చేసేదాన్ని కాదు. కానీ, లాక్డౌన్ లో మొత్తంగా ఇంట్లోనే ఉండడం, కుటుంబ సభ్యులతోనే గడపడంతో … వాళ్ళు నన్ను కన్విన్స్ చేశారు. నేను కూడా రామ్ ప్రొపోజల్ గురించి చెప్పి…దాని గురించి డిస్కషన్ కి పెట్టాను,” అలా తాను రెండో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది ఈ ఇంటర్వ్యూలో.

సునీత, రామ్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారు. హనీమూన్ కెళ్లారు. ఐతే, ఈ వయసులో హనీమూన్ ఏంటి అంటూ ఆమెని ట్రోల్ చేసే వారు కూడా ఉన్నారు.

More

Related Stories