లాక్దౌన్లో బాయ్ ఫ్రెండ్ తో లాక్!

- Advertisement -
Shruti Haasan


దేశమంతా లాక్డౌన్ నడుస్తోంది. అందరూ ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. శృతి హాసన్ కూడా తన ఇంట్లోనే ఉంటోంది. ఇటీవలే ఆమె ముంబైలో ఫ్లాట్ కొనుక్కొంది. ఆ ఇంట్లో ఇప్పుడు లాక్డౌన్ టైంని వెళ్లదీస్తోంది. ఆమెకి తోడుగా బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా ఉంటున్నాడు. ఇది గాసిప్ కాదు. స్వయంగా శృతి హాసన్ చెప్తోంది.

తన బాయ్ ఫ్రెండ్ తో రకరకాల ఫోజుల్లో ఫొటోలు దిగింది. వాటిని అన్నిటిని కలిపి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. “Locked down with my bestie (నా స్నేహితుడితో ఇలా బందీ అయ్యాను)” అంటూ తనే రాసుకొంది

శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్స్ విషయంలో ఎప్పుడూ ఓపెన్ గానే ఉంటుంది. దాచిపెట్టుకోదు. ఈ కొత్త బాయ్ ఫ్రెండ్ విషయంలో కూడా అంతే.

More

Related Stories