
దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఆయన తీసిన సినిమాలన్నీ హిట్లే. తాజాగా ‘లియో’ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఐతే, తెలుగులో ప్రభాస్ తో ఒక మూవీ చేస్తాను ఆ మధ్య ప్రకటించాడు లోకేష్.
కానీ ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదలు కావాడానికే 4 ఏళ్ళు పడుతుందట.
లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ తో తన తదుపరి చిత్రం తీయనున్నాడు. ఆ తర్వాత కార్తీ హీరోగా “ఖైదీ 2”. ఆపై సూర్య హీరోగా “రోలెక్స్” అనే మూవీ. అలాగే “విక్రమ్ 2” ఉంది. ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యాకే ప్రభాస్ చిత్రం ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ పూర్తి అయ్యేసరికి కనీసం నాలుగేళ్లు పడుతుంది.
“లియో” పెద్ద హిట్ అయినా విజయ్ తో మరో సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చు. విజయ్ త్వరలో రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. సో, వీరి కలయికలో మూవీ ఇప్పుడే ఉండదు. తెలుగులో మాత్రం రామ్ చరణ్, ప్రభాస్ లతో సినిమాలు చేస్తాను అని చాలా కాలం క్రితమే ప్రకటించాడు. అందులో ప్రభాస్ మూవీ గురించి ఇటీవల ప్రస్తావించాడు లోకేష్. ప్రభాస్ తో మూవీ భారీగా ఉంటుంది అని చెప్పాడు.