- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ప్రొమోషన్ మొదలైంది. విడుదలైన తొలి పాట ‘లాహే లాహే’ క్లిక్ అయింది. నెల రోజుల్లో సినిమా విడుదల కానుంది. సో… ఇక చిరంజీవి లూసిఫర్ రీమేక్ కూడా స్టార్ట్ చెయ్యాల్సిన టైం వచ్చింది. ఐతే, ఈ సినిమాకి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ‘క్యాస్టింగ్’ కుదరట్లేదు.
ఇంతకుముందు ‘సై’ అని చెప్పిన నటులు ఇప్పుడు డేట్స్ సమస్య అంటూ నసుగుతున్నారట. అంటే… వాళ్ళు చేయలేమని చెప్తున్నట్లే. అందుకే… కీలకమైన ఐదు ఇతర పాత్రలకు నటులు ఫిక్స్ కావాలి. దర్శకుడు మోహన్ రాజా ఇప్పుడు ఆ పనిలో ఉన్నాడు. అంతా సెట్ ఐతే ఈ నెలలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుంది. లేదంటే ఆలస్యమే.
మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.