రేపే లూసిఫర్ రీమేక్ లాంచ్

Chiranjeevi and Mohan Raja

మెగాస్టార్ చిరంజీవి రేపు మరో సినిమాకి శ్రీకారం చుడుతున్నారు. మలయాళంలో సూపర్ హిట్టైన “లూసిఫర్” సినిమా రేపే లాంఛనంగా లాంఛ్ అవుతుంది. తమిళంలో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకుడు.

రేపు హైదరాబాద్ లోని మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆఫీస్ లో సింపుల్ గా పూజ కార్యక్రమాలను నిర్వహిస్తారు. చిరంజీవి, దర్శకుడు రాజా, నిర్మాత ఎన్వీ ప్రసాద్, మరికొద్ది అతిథుల సమక్షంలో లాంచ్ జరుగుతుంది. రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో కానీ, ఏప్రిల్ లో కానీ షురూ అవుతుంది. నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మెగాస్టార్ ఈ సినిమాలో మోహన్ లాల్ పోషించిన పాత్రలో కనిపిస్తారు. మలయాళ సినిమా వర్షన్ సోల్ దెబ్బతినకుండా స్క్రిప్ట్ రెడీ చేశారట మోహన్ రాజా. ఆయన తమిళంలో “జయం” వంటి సినిమాలను సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేశారు. నయనతార… మెగాస్టార్ కి సిస్టర్ గా నటించనుంది. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపిస్తాడు.

More

Related Stories