తెలుగు ‘లస్ట్ స్టోరీస్’కి మోక్షం

నెట్ ఫ్లిక్స్ నిర్మించిన “లస్ట్ స్టోరీస్” హిందీలో బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో ఒక బోల్డ్ సీన్లో నటించి… కియారా అద్వానీ బాగా పాపులర్ అయింది. హిందీలో సక్సెస్ కావడంతో తెలుగులో దాన్ని రీమేక్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ సంస్థ రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసింది. ఇన్నాళ్లకు ఆ వెబ్ మూవీకి మోక్షం కలుగుతోంది.

తెలుగులో త్వరలోనే స్ట్రీమ్ చేస్తున్నామని నెట్ ఫ్లిక్స్ అఫీషయల్ గా ప్రకటించింది.

హిందీలో లాగే, తెలుగులో కూడా నాలుగు కథలుంటాయి. నాలుగు కథలు కూడా సెక్స్ చుట్టే తిరుగుతాయి. ఒక్కో కథకి ఒక్కో దర్శకుడు, వేర్వేరు నటులు.

తెలుగులో తరుణ్ భాస్కర్ (“పెళ్లి చూపులు” ఫేమ్), నాగ్ అశ్విన్ (“మహానటి”), నందిని రెడ్డి (“ఓ బేబీ”), సంకల్ప్ రెడ్డి (“ఘాజి”) ఒక్కో కథని డైరెక్ట్ చేశారు. కియారా అద్వానీ పోషించినటువంటి ఒక బోల్డ్ రోల్ ని తెలుగు ఈషా రెబ్బ పోషించింది. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది.

Also CHECK: Eesha Rebba Latest Photos

More

Related Stories