రంగ్ దే పాటల్లో వైవిధ్యముంది: శ్రీమణి


10 ఏళ్లలోనే లీడింగ్ గేయ‌ర‌చ‌యితగా ఎదిగారు శ్రీ‌మ‌ణి. ఇటీవల ‘ఉప్పెన’ పాటలతో పెద్ద క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘రంగ్ దే’ మూవీలోని నాలుగు పాట‌ల్నీ ఆయ‌నే రాశారు. “ఒక ఆల్బ‌మ్‌లో ఒక‌దానికొక‌టి భిన్నంగా అనిపించే పాట‌లు ఉండ‌టం అరుదుగా జ‌రుగుతుంటుంది. దేవి శ్రీ‌ప్ర‌సాద్ ఆల్బ‌మ్‌లోని పాట‌ల్ని డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ‘రంగ్ దే’ ఆల్బ‌మ్ అలాంటిదే,” అని అంటున్నారు శ్రీమణి.

దేవిశ్రీ ప్రసాద్ తో పదేళ్ల అనుబంధం ఆయనది. “100% ల‌వ్’ సినిమాతో ఆయ‌న‌తో నా ప్ర‌యాణం మొద‌లైంది. ఈ ఏప్రిల్‌తో మా ప్ర‌యాణానికి ప‌దేళ్లు పూర్త‌వుతాయి,” అని చెప్పారు.

“సాధార‌ణంగా నేను ఓ పాట రాస్తే మొద‌ట నా భార్య‌కు లేదంటే నా ఫ్రెండ్ ముర‌ళికి, రైట‌ర్ తోట శ్రీ‌నివాస్‌కు వినిపిస్తుంటా. దేవిగారి మ్యూజిక్‌కు కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో వ‌ర్క్ చేసేట‌ప్పుడు ఆయ‌న‌తో నా పాట షేర్ చేసుకొని, ఆయ‌న నుంచి స‌ల‌హాలు తీసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఫిలసాఫిక‌ల్ సాంగ్స్ రాసిన‌ప్పుడు గురువుగారు సీతారామ‌శాస్త్రి గారికి వినిపించి, ఆయ‌న నుంచి స‌ల‌హాలు తీసుకుంటుంటా,” అని తన పాటల కసరత్తు గురించి చెప్పారు.

Advertisement
 

More

Related Stories