
ప్రస్తుతం ఉన్న ‘మా’ కార్యవర్గం పదవీకాలం ముగిసిపోతోంది. ఐతే, కారోనా కాలమని చెప్పి తమ పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించుకోవాలని అధ్యక్షుడు నరేష్ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ‘మా’ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. జూమ్ లో నిర్వహించారు ఈ మీటింగుని. వాడివేడిగా ముగిసింది సమావేశం.
ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాలని అందరూ పట్టుబట్టడంతో దానికి నరేష్ అంగీకరించారట. అక్టోబర్ లోపు ఎన్నికలను నిర్వహిస్తామని మా సీనియర్ సభ్యులు మురళీమోహన్ వెల్లడించారు.
ప్రకాష్ రాజ్, ఆయన వర్గం ఈ విషయంలో ఎక్కువ హంగామా చేశారు. వీలైనంత తొందర్లో ఎన్నికలు జరపాలని ప్రకాష్ రాజ్ పట్టుబట్టారు. ఐతే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ స్పేస్ ఉండే ప్రదేశం కావాలని, అవన్నీ చూసుకోవాలంటే సెప్టెంబర్ లో నిర్వహించడం సాధ్యం కాదని నిర్ణయించారు. సో, అక్టోబర్ నెల ముగిసేలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని మురళీమోహన్ అంటున్నారు.