
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి పెదవి విప్పారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడు లేఖ రాయడం విశేషం. మా ఎన్నికలు వెంటనే జరిగేలా చూడాలని ’మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖ రాశారు చిరంజీవి.
ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ వైఖరిఫై చిరంజీవి కూడా ఆగ్రహంగా ఉన్నారని ఆయన లేఖతో అర్థమైంది. ‘మా’ ఎన్నికలు వచ్చే నెలలో జరగాలి. కానీ వాటిని వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు నరేష్. అతని తీరుపై ఇప్పటికే పలువురు మండిపడుతున్నారు. ఇప్పుడు చిరంజీవి లేఖతో ఇక ‘యుద్ధం’ మొదలైంది అని సంకేతాలు వెలువడ్డాయి. నరేష్ చేష్టలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించినట్లు అయింది. నరేష్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అన్న విషయాన్నీ చిరంజీవి ఎత్తి చూపడం విశేషం.
ఇంకా ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని మెగాస్టార్ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, ‘మా’ ప్రతిష్ట దెబ్బతినేలా కొందరి సభ్యుల ప్రవర్తన ఉందని చిరంజీవి స్పష్టం చేశారు. అలా చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని కృష్ణంరాజును చిరంజీవి కోరారు.
ప్రకాష్ రాజ్ టీంని అడ్డుకునేందుకు నరేష్, ఆయన వత్తాసు పలుకుతున్న కొందరు ఎన్నికలు ఆపాలని చూస్తున్నారట.