MAA: పాత ఆరోపణలే కొత్తగా!

- Advertisement -
MAA

త్వరలోనే ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో, ఆరోపణల పర్వం మొదలయింది. రాజకీయనాయకుల్లాగే సినిమాల హీరోలు కూడా పాత ఆరోపణలే కొత్తగా చేస్తున్నారు. ప్రస్తుతం ‘మా’అధ్యక్షుడు నరేష్. ఆయన రెండేళ్ల క్రితం గెలిచే ముందు… ‘మా’లో బయటపడిన స్కాం అంటూ హడావిడి చేశారు. ‘మా’ కోసం ఒక అపార్ట్మెంట్ కొన్నారని, అది వివాదాల్లో పడడంతో పక్కన నిరుపయోగంగా ఉందని, అదొక పెద్ద స్కామ్ అని ఆరోపణలు చేశారు రెండేళ్ల క్రితం.

అంతకుముందున్న అధ్యక్షుడు అలా కుంభకోణం చేశారన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ దాని గురించి మీడియాలో ‘రాయించుకుంటున్నారు’. రెండేళ్ల పదవి కాలంలో దాని గురించి పట్టించుకోలేదు. పక్కా రాజకీయనాయకుల్లాగా సరిగ్గా ఎన్నికల టైంలోనే మళ్ళీ గుర్తొచ్చింది ఆ స్కామ్,

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘ఐక్యత’ అనేది ఒక బూటకం. మన హీరోలు, నటుల ‘నట విన్యాసం’ ముందు రాజకీయకాయకులు ఎందుకూ పనికరారు.

 

More

Related Stories