
తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. త్వరలోనే పోలింగ్ జరగనుంది. ప్రెసిడెంట్ గా తాను బరిలోకి దిగుతాను అని ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఇప్పుడు, మంచు విష్ణు పేరు కూడా వినిపిస్తోంది.
మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతారట. ఐతే, చిరంజీవి మాట ప్రకారం ఎవరో ఒకరు డ్రాప్ కావాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వీరు ఇద్దరూ మెగాస్టార్ చిరంజీవి వర్గానికి చెందినవారే.
గత కొన్నేళ్లుగా ‘మా’ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల రేంజులో రసవత్తరంగా సాగుతున్నాయి. తిట్లు, ఆరోపణలు… ప్రచారాల ఊపు, మీడియా హైప్ తో ‘మా’ ఎన్నికలు ఒక ప్రహసనంగా మారాయి.
గతంలో ప్రకాష్ రాజ్ అనేక వివాదాలు ఇరుక్కున్నారు. అప్పుడు ‘మా’ అతన్ని కాపాడింది. ఇప్పుడు అయన ‘మా’కి అధ్యక్షుడిగా పోటీపడుతుండడం విశేషం. మంచు విష్ణు ఇప్పటికే ‘మా’లో పలు పదవులు నిర్వర్తించాడు. ఇప్పుడు ఏకంగా ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నాడు.