మా కోసం మూడు స్థలాలు: విష్ణు

- Advertisement -
Manchu Vishnu


‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి ప్రధాన హామీ… ‘మా’కి స్వంత బిల్డింగ్ ఏర్పాటు చేయడం. అధ్యక్షుడిగా పోటీలో ఉన్నట్లు ప్రకటించిన మంచు విష్ణు ఈ హామీ విషయంలో దూకుడు మీదున్నారు. ఇప్పటికే మూడు స్థలాలను కూడా ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. హైదరాబాద్ లో తన కారులో వెళ్తూ ఒక వీడియోని రికార్డ్ చేశారు మంచు విష్ణు.

మూడు స్థలాలని తాను స్వయంగా చూసి వస్తున్నట్లు తెలిపారు. అందులో ఎదో ఒకటి అందరం కూర్చొని సెలెక్ట్ చేద్దామని ‘మా’ సభ్యులకు చెప్తున్నారు మంచు విష్ణు.

ఈ సారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, హేమ, సివీఎల్, జీవిత కూడా బరిలో ఉన్నారు. మంచు విష్ణు మాత్రం ప్రధానంగా “మా”కి స్వంత భవనం కట్టిస్తాను అని హామీ ఇస్తున్నారు. విష్ణుకు నందమూరి బాలకృష్ణ, ఇతర పెద్ద హీరోల సపోర్ట్ ఉన్నట్లు కనిపిస్తోంది.

 

More

Related Stories