ఆగస్టులో ‘మాటరాని మౌనమిది’

- Advertisement -
Maata Raani Mouanmidi

“మాటరాని మౌనమిది” అనే పొయెటిక్ టైటిల్ తో ఒక మూవీ రూపొందుతోంది. మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది ప్రేమకథ మాత్రమే కాదు థ్రిల్లర్ కూడా అని చెప్తున్నారు మేకర్స్. చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది.

“కోవిడ్ టైమ్ లో తీసిన ‘శుక్ర’ సినిమా గతేడాది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది. ఆ ప్రోత్సాహంతో మాటరాని మౌనమిది చిత్రాన్ని రూపొందించాను. మల్టీ జానర్ థ్రిల్లర్ ఇది. ఆగష్టులో థియేటర్స్ లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాం,” అన్నారు దర్శకుడు సుకు పూర్వాజ్.

“మేము ఈ కథ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యామో ప్రివ్యూ చూసిన తరువాత అంతకంటే ఎక్కువ సంతోషించాం. సినిమా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా వచ్చింది,” అని అన్నారు నిర్మాతలు

హీరోయిన్ సోనీ తెలుగు అమ్మాయే.

 

More

Related Stories