- Advertisement -
మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మల్టిజోనర్ మూవీ… మాటరాని మౌనమిది. ఈ మూవీ ట్రైలర్ విడుదలయింది. లవ్ స్టొరీకి థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ కుదిరిందిట. అందుకే ఇది మల్టి జోనర్ మూవీ అని చెప్తున్నారు.
పాన్ ఇండియా స్టార్స్ అయిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్ బ్లెస్సింగ్స్ తో ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ చూస్తే హీరో ఒక మూగ అమ్మాయితో ప్రేమలో పడడం, హీరో బావ ఇంట్లో కొన్ని సంఘటనలు జరగడం… దాంతో కథ లవ్ డ్రామా నుంచి థ్రిల్లర్ జోనర్లోకి మారినట్లు కనిపిస్తోంది.
ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తామని అంటున్నారు మేకర్స్. సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న ‘మాటరాని మౌనమిది’ ఆగస్టు 19న విడుదల కాబోతోంది.