
“సఖి” సినిమాతో దేశవ్యాపంగా ఎందరినో ఫాన్స్ చేసుకున్న హ్యాండ్సమ్ హీరో మాధవన్ ఇప్పుడు విలన్ పాత్రలకు టర్న్ అయ్యాడు. తెలుగులో లేట్ గా ఎంట్రీ ఇచ్చి విలన్ రోల్స్ చేశాడు. ఆయనకు ఇప్పుడు 50 ఏళ్లు. అందుకే, ఈ రోల్స్ ఎంచుకుంటున్నాడు. ఐతే, మాధవన్ మాత్రం ఇప్పుడు తెలుగు సినిమాలంటే భయపడ్తున్నాడట.
ఆయన తెలుగులో ఇప్పటివరకు చేసిన ఏ సినిమా ఆయనకు పేరు తీసుకురాలేదు. విజయాన్ని తెచ్చిపెట్టలేదు. రీసెంట్ గా విడుదలైన “నిశ్శబ్దం”, అంతకుముందొచ్చిన “సవ్యసాచి” పరాజయం అయ్యాయి. ఆ పాత్రలు కూడా బాలేవు. తెలుగు దర్శకులు చెప్పేది ఒకటి, తీసేది మరోటి అని మాధవన్ అభిప్రాయానికి వచ్చాడట.
అందుకే, “పుష్ప” సినిమాలో విలన్ పాత్రని కూడా రిజెక్ట్ చేశాడు. అలాగే, మరో చిన్న సినిమాలో కీలక పాత్రకి నో చెప్పాడు. మాధవన్ తెలుగులో మళ్ళీ చేస్తే, మంచి రోల్ అయితేనే చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు.