మాధవన్ మళ్లీ అతడ్ని నమ్ముతాడా?

Madhavan

కర్త-కర్మ-క్రియ అన్నీ తానై “నిశ్శబ్దం” సినిమాను తెరకెక్కించాడు కోన వెంకట్. కట్ చేస్తే, సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. కోన వెంకట్ కు ఇలాంటి ఫలితాలు కొత్తకాదు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న బాడీ అది. కాకపోతే ఇక్కడ మేటర్ వేరు. ఇది కోన-మాధవన్ మధ్య సంగతి

గతంలో ఇదే కోన వెంకట్, మాధవన్ ను రిక్వెస్ట్ చేసి మరీ ఓ సినిమాకు ఒప్పించాడు. అప్పట్లో మంచి స్వింగ్ మీదున్న మాధవన్, కోన మాటలు నమ్మి ప్రాజెక్టులోకి వచ్చాడు. స్వయంగా కోన దర్శకుడిగా మారి మాధవన్ హీరోగా సినిమా తీశాడు. కానీ ఆ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆగిపోయింది. కోన నుంచి మాధవన్ కు తొలి దెబ్బ అది.

నిశ్శబ్దం కోసం సంప్రదించినప్పుడు కూడా మాధవన్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఈసారి కోన గట్టిగా హామీ ఇచ్చాడు. కానీ ఈసారి పరిస్థితులు కోన చేజారిపోయాయి. థియేటర్లలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఓటీటీకొచ్చింది. అలా అని ఓటీటీలో కూడా దీనికి ఆదరణ దక్కలేదు. అలా మాధవన్ కు కోన నుంచి రెండో దెబ్బ తగిలింది.

చూస్తుంటే.. కోన-మాధవన్ కాంబినేషన్ సెంటిమెంట్ పరంగా వర్కవుట్ అయ్యేలా లేదు.

Related Stories