నన్ను వేధిస్తున్నారు: మాధవీలత

Madhavi Latha

హీరోయిన్ మాధవీలత ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చెయ్యడం మానేసింది. బీజేపీ నాయకురాలిగా బిజీగా ఉంది. రెగ్యులర్ గా ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతూ బీజేపీయేతర పార్టీలను విమర్శలు గుప్పిస్తుంటుంది. ఆమెని జనం కూడా అదే రేంజులో ట్రోల్ చేస్తుంటారు.

లేటెస్ట్ గా కొందరు అదే పనిగా తనని సోషల్ మీడియాలో వేధిస్తున్నారు అని చెప్తోంది. అంతేకాదు, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులని ఆశ్రయించింది. అమ్మాయిలు, హీరోయిన్లు ఏదైనా కేసులో పట్టుబడితే, అందులో మాధవీలత కూడా ఉందంటూ కొందరు అబద్ధపు ప్రచారాలు మొదలుపెట్టారట. కావాలని తన ప్రతిష్ట, ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.

పోలీస్ కమీషనర్ సజ్జనార్ ని కలిసి వారిపై ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా… ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడుల గురించి తను మాట్లాడుతుండడంతో తనపై ఈ వేధింపులు ఎక్కువయ్యాయని ఆమె అంటోంది.

More

Related Stories