సమంతకి తల్లిగా మధుబాల

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించిన వారి ఫోటోలను తాజాగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో సమంతకి తల్లిగా ‘రోజా’ మధూ నటించిందిట.

మధుబాల (మధూ) ఇప్పటికే తల్లి పాత్రలు పోషిస్తోంది. ఐతే, ఇందులో ఆమె సమంతకి తల్లిగా నటించడం వేరు. ఎందుకంటే, ఆమె పోషించిన పాత్ర… మేనక. స్వర్గంలో ఉండే అందెగత్తెలైన ‘రంభ, ఊర్వశి, మేనక’ల్లో ఒకరైన మేనక పాత్ర అది. ఆ మేనక కూతురు శకుంతల. ఆ శకుంతల పాత్రని సమంత పోషించింది.

ఇప్పటివరకు మనం సినిమాల్లో ‘యంగ్’గా ఉన్న మేనకని చూశాం. ఈ సినిమాలో వయసుమళ్ళిన మేనకని చూడబోతున్నాం.

గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మోహన్ బాబు, అనన్య నాగళ్ల, అదితి బాలన్ కూడా నటించారు.

Advertisement
 

More

Related Stories