భర్తతో ఆనందంగా మధుషాలిని


హీరోయిన్ మధుషాలిని ఇటీవల పెళ్లి చేసుకొంది. తమిళ సినిమాల్లో నటించే యువ హీరో గోకుల్ తో ఆమెకి పెళ్లి అయింది. నాలుగు రోజుల క్రితం సింపుల్ గా ఇరువైపులా కుటుంబ సభ్యుల సమక్షంలో ఒకటయింది ఈ జంట. తాజాగా ఈ భామ తన భర్తతో కలిసి దిగిన ఫోటోషూట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా షేర్ చేస్తోంది.

కొత్త జీవితంలో అడుగుపెట్టి ఆనందంగా ఉన్నాను అని పేర్కొంది.

మధుషాలిని అచ్చ తెలుగు భామ. ఒక విచిత్రం, జగడం, గోపాల గోపాల, గూఢచారి వంటి చిత్రాల్లో నటించింది. మొదట హీరోయిన్ వేషాల్లో కనిపించి ఆ తర్వాత ప్రత్యేక పాత్రలకు వచ్చింది. తెలుగులో పెద్దగా సక్సెస్ రాకపోవడంతో తమిళంలో అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడే గోకుల్ పరిచయం అయ్యాడు.

2019లో వీరిద్దరూ కలిసి ఒక తమిళ్ చిత్రంలో నటించారు. ఆ సెట్ లో పరిచయం అయింది, సెట్ అవతల ప్రణయం జరిగింది. కరోనా గోల ముగియగానే పరిణయం దిశగా అడుగులు వేసి… ఇంట్లో వారిని ఒప్పించి తాజాగా ఏడడుగులు వేశారు.

 

More

Related Stories