‘మద్రాసి గ్యాంగ్’ ప్రారంభం

పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమెటెడ్ పతాకంపై ఎస్.ఎన్ రెడ్డి ‘‘మద్రాసి గ్యాంగ్’’ అనే కొత్త సినిమా తీస్తున్నారు. తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీని అజయ్ ఆండ్రూస్ నూతంకి డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా జరిగాయి.

“మా బ్యానర్ లో ఇంతకు ముందు మంచు మనోజ్ తో ‘‘ఒక్కడు మిగిలాడు’’ మూవీ తీసిన అజయ్ ఆండ్రూస్ నూతంకి దర్శకత్వంలో మరో సినిమా తీస్తున్నాం..క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 13 నుండి ప్రారంభమవుతుంది. హిందీ,తమిళ భాషల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నాం. మెయిన్ లీడ్ గా సంతోష్ రంగ జిను నటిస్తున్నారు,” అని నిర్మాత తెలిపారు.

Related Stories