
నితిన్ హీరోగా నటించిన ‘మాస్ట్రో’ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 17న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో రాబోతోన్న సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు…
“ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ‘అంధధూన్’ సక్సెస్ మంచి ఉదాహరణ. ఆ సినిమా రీమేక్‌లో నటించడం ఆనందంగా ఉంది.”
“ఇంతకుముందు నేను రీమేక్ చిత్రాల్లో నటించలేదు. రాధికా ఆప్టే అద్బుతంగానటించిన పాత్ర చేయాలంటే మొదట భయమేసింది. అందుకే, ఆ సినిమాని మళ్ళీ చూడలేదు. నా స్టయిల్లో చేసేందుకు ప్రయత్నించా. నితిన్ తో జోడిగా నటించడం బాగుంది. షూటింగ్ సరదాగా సాగింది.”

“కరోనా సమయంలో నేను నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇది మూడో సినిమా. కానీ ఆ రెండు సినిమాలు థియేటర్లలోనే రిలీజ్ అయ్యాయి. నా కెరీర్ లో ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల అవుతున్న మొదటి సినిమా.. ‘మాస్ట్రో’. ఆ విధంగా నాకు ఇది ఫస్ట్ ఎక్స్ పీరియన్స్.”
“తెలుగులో నా డబ్బింగ్ నేనే చెప్పాలనుకున్నాను. కానీ కరోనా వల్ల టైం కుదరలేదు. అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయాను. తదుపరి చిత్రాల్లో కచ్చితంగా డబ్బింగ్ చెబుతాను.”
“కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేశాను. కానీ మేకర్స్ ప్రకటిస్తే బాగుంటుంది. నేను చెప్పకూడదు.”
“నాకు అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించాలని ఉంది. గ్లామర్, డీగ్లామర్…ఏదైనా చేస్తా.”