సమంత కోసం 3 కోట్ల సెట్

- Advertisement -
Samantha

సమంత ప్రధాన పాత్రలో ‘యశోద’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు శివలెంక కృష్ణప్రసాద్. ఈ సినిమా కోసం ఆయన భారీగా ఖర్చు పెడుతున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేశారు. సెట్స్ కోసం సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందట. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకి ఇది భారీ అమౌంట్.

‘ఒక్కడు’లో ఛార్మినార్ సెట్ వేసిన కళాదర్శకుడు అశోక్ ఈ భారీ సెట్ వేశారు.

“సినిమాలో 30 నుంచి 40 శాతం సన్నివేశాలు ఓ ప్రాంతంలో జరుగుతాయి. అందుకోసం హైదరాబాద్‌లో చాలా స్టార్ హోటల్స్ చూశాం. అయితే… 35, 40 రోజులు హోటల్స్‌లో చిత్రీకరణ చేయడం అంత సులభం కాదు. అందుకని, సీనియర్ కళా దర్శకుడు అశోక్ నేతృత్వంలో సెట్స్ రూపొందించాం. నాన‌క్‌రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో రెండు ఫ్లోర్స్ తీసుకుని వేసిన ఈ సెట్స్ కోసం సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. డైనింగ్ హాల్, లివింగ్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ… సెవెన్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యాలను తలపించేలా ఏడెనిమిది సెట్స్ వేశాం. ఫిబ్రవరి 3న మొదలైన షెడ్యూల్ అక్కడే జరుగుతోంది,” అన్నారు నిర్మాత.

ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లోనే విడుదల చేస్తారట.

More

Related Stories