మహారాష్ట్ర, కేరళ భయపెడ్తున్నాయి!

- Advertisement -
Rajamouli


దేశంలో మళ్ళీ కేసులు పెరుగుతున్న మాట వాస్తవం. అయితే, మిగతా రాష్ట్రాలతో పోల్చితే కేరళ, మహారాష్ట్రల పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. దేశంలో అత్యధికంగా వ్యాక్సిన్లు తీసుకున్న రాష్ట్రం… మహారాష్ట్ర. అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కన్నా వ్యాక్సినేషన్ రేట్ కేరళలో బేషుగ్గా ఉంది. అయినా, ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గట్లేదు. మరింతగా పెరుగుతున్నాయి.

మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో థియేటర్లు ఓపెన్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించడం లేదు. అక్టోబర్ వరకు అక్కడ ఇంతే అనేది లేటెస్ట్ టాక్. కేరళలో అసలు థియేటర్లకు అనుమతి ఇవ్వడం లేదు. అక్కడున్న పరిస్థితి చూస్తుంటే… నవంబర్ వరకు అక్కడ థియేటర్లు ప్రారంభం కావు. హిందీ వర్షన్ కి, మలయాళం వర్షన్ కి ఇది పెద్ద దెబ్బ.

కేసుల తాకిడి ఇలాగే ఉంటే “ఆర్ ఆర్ ఆర్” విడుదల అక్టోబర్ 13న ఉంటుందా అనేది సందేహంగా మారింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన “బెల్ బాటమ్” గత నెలలో విడుదల కావాలి. కానీ మహారాష్ట్రలో థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో ఇప్పుడు ఆగస్టు 19న విడుదల కానుంది. మహారాష్ట్రలో మాత్రం రిలీజ్ కాదు.

“బెల్ బాటమ్”లా “ఆర్ ఆర్ ఆర్” కొన్ని రాష్ట్రాలను వదులుకోలేదు. అందుకే రాజమౌళి సినిమా విడుదలపై పక్కాగా క్లారిటీ రావాలంటే సెప్టెంబర్ రెండో వారం వరకు వేచి చూడాలి.

 

More

Related Stories