మహేష్, రాజమౌళి టార్గెట్ 2023

మహేష్ బాబు లాస్ట్ ఇయర్ ప్రకటించిన “సర్కారు వారి పాట” రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. మరికొద్ది రోజులు ఆలస్యం కానుంది. షూటింగ్ స్టార్ట్ అవడం లేట్ అయినా, రిలీజ్ మాత్రం పక్కాగా ఆగస్టులోనే ఉంటుందట. దర్శకుడు పరుశరాం స్పీడ్ గా తీస్తాడు.

ఇక రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలవుతుంది? “ఆర్.ఆర్.ఆర్” సినిమా ఈ దసరాకే విడుదల అవుతుంది అని ఒక టాక్ ఉంది. కానీ రిలీజ్ డేట్ ఇప్పుడే చెప్పడం కష్టం. “ఆర్.ఆర్.ఆర్” 2021 దసరాకి వచ్చినా, 2022 సంక్రాంతికి విడుదల అయినా… రాజమౌళి తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో 2022లోనే స్టార్ట్ చేస్తాడు.

అంటే మహేష్ బాబు “సర్కారు వారి పాట” పూర్తి కాగానే ఇంకోటి మొదలుపెట్టుకోవచ్చు. ఇప్పటికే బేసిక్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నారాయణ నిర్మాతగా తెరకెక్కనుంది.

2023 టార్గెట్ గా రాజమౌళి  నెక్స్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట.

More

Related Stories