నీలిమ రిసెప్షన్ కి బన్ని, మహేష్


సూపర్ స్టార్ మహేష్ బాబు దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ వివాహ రిసెప్సన్ కి హాజరయ్యేందుకు తన దుబాయ్ ట్రిప్ ని ముగించారు.

రవి ప్రక్యా అనే వ్యాపారవేత్తని నీలిమ ఇటీవల పెళ్లి చేసుకొంది. వీరి రిసెప్సన్ ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

మహేష్ బాబు, అల్లు అర్జున్ ఒకే సమయంలో ఈ వేడుకకు రావడంతో ఇద్దరూ ఒకేసారి నవ దంపతులతో ఫోటో దిగారు. మహేష్ బాబుకి ‘ఒక్కడు’, ‘అర్జున్’ వంటి చిత్రాలు ఇచ్చారు గుణశేఖర్. ఇక అల్లు అర్జున్ తో ‘రుద్రమదేవి’, ‘వరుడు’ చిత్రాలు తీశారు.

విదేశాల్లో ఫిలింమేకింగ్ కోర్సు పూర్తి చేసిన నీలిమ ‘శాకుంతలం’ సినిమాతో నిర్మాతగా మారారు.

Advertisement
 

More

Related Stories