అక్కడ ఎన్టీఆర్, మహేష్ డామినేషన్!


మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల మార్క్ దాటేసి రెండు మిలియన్ల మైలురాయి వైపు సాగుతోంది. వన్ మిలియన్ అంతకుమించి వసూళ్లు అందుకున్న తెలుగు చిత్రాల సంఖ్య పెద్దదే. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు ప్రీమియర్ షోతోనే అంత వసూళ్లు సాధించగలుగుతున్నాయి.

అమెరికాలో వన్ మిలియన్ అంతకన్నా ఎక్కువ వసూళ్లు అందుకున్న చిత్రాలు మహేష్ బాబు ఖాతాలో 11 ఉన్నాయి. ‘సర్కారు వారి పాట’తో కలిపి 11 ఆయన ఖాతాలో చేరడంతో కొత్త రికార్డు క్రియేట్ అయింది. తెలుగు హీరోల్లో మహేష్ బాబుదే రికార్డు.

 1. సర్కారు వారి పాట
 2. భరత్ అనే నేను
 3. శ్రీమంతుడు
 4. సరిలేరు నీకెవ్వరు
 5. మహర్షి
 6. స్పైడర్
 7. 1 నేనొక్కడినే
 8. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
 9. ఆగడు
 10. దూకుడు
 11. బ్రహ్మోత్సవం

ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో వన్ మిలియన్ చిత్రాలు ఏడు ఉన్నాయి.

 1. ఆర్ ఆర్ ఆర్
 2. అరవింద సమేత
 3. నాన్నకు ప్రేమతో
 4. జనతా గ్యారేజ్
 5. బాద్షా
 6. టెంపర్
 7. జై లవకుశ

ఈ ఇద్దరి హీరోలకు దర్శకులతో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వస్తాయి అమెరికాలో. పెద్ద దర్శకుడు, టాక్ కలిసి వస్తే వసూళ్లు కూడా భారీగా ఉంటాయి.

 

More

Related Stories